Trump: కెనడా 51వ రాష్ట్రంగా మారాలని ట్రంప్ వ్యాఖ్యలు..! 1 d ago
కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో రాజీనామా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అమెరికాకు కాబోయే అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. కెనడా 51వ రాష్ట్రంగా మారాలనే అభిప్రాయాన్నిపునరుద్ఘాటించారు. ఈ నేపథ్యంలో ఆయన ట్రూత్ సోషల్ వేదికగా పోస్ట్ చేశారు. కెనడాలోని ప్రజలకు అమెరికాలో 51వ రాష్ట్రంగా ఉండటం ఇష్టమేనని భావిస్తున్నా. అదనంగా కెనడాకు అధిక రాయితీలు ఇచ్చి మాదేశం ఇంకా నష్టపోవాల్సిన అవసరం లేదని రాసుకొచ్చారు.